=అక్షర ఒయాసిస్సు=
పసిరిక నిండిన సెలయేళ్ల మధ్య నో , పచ్చని
పంట పోలాలు మధ్యని ఇళ్ళలోనో పెరగటం
అలవాటైన మేము, ఒక్కసారి ఈ నగరం లో
పడి, మా చుట్టూ ఒక కాలుష్య, అమానవీయ
విష వలయాన్ని సృష్టించుకున్నాము.
చూస్తూండగానే స్పందించడం మర్చిపోయిన మనస్సు
స్పందించడం మాత్రమె తెలుసుకున్న హృదయం
కాంతిని కన్నీళ్ళని గుర్తించని కళ్ళు.
రాగం మర్చిపోయిన గంధర్వుడు.
ఆలాంటప్పుడే తొలకరి జల్లు లాంటి ఈ కవిత్వం
మమ్మల్ని చేరి దిగులు పొరల్ని కడిగేస్తుంది,
నగరానికి ప్రకృతిని పరిచయం చేస్తుంది.
ఇప్పుడు మా చుట్టూ అక్షర ఒయాసిస్సు.
Comments
Post a Comment