రాజశేఖర్
గుదిబండి(చంద్రం) ||తెలియని తనం ||
కళ్ళ కు తెలియదు కలలెప్పుడు వస్తాయో
కన్నీళ్ళ విలువ కళ్ళకు తెలియదు
దుఃఖం కన్నీళ్ళతో ఆగదు
హృదయం బాధ మనసుకి తెలియాలని లేదు.
హృదయం , మనస్సు ఏకమవడం
ఎప్పుడో కాని తెలియదు.
గమ్యానికి తెలియదు తనను చేర్చే దారేదో
దారికి తెలియదు తనతో వచ్చేదెవరో
కరిగిన కాలం ఏమవుతుందో తెలియదు
భవిష్యత్తు జ్ఞాపకం గా మారటం కూడా తెలియదు
పోయే
ప్రాణానికి తెలియదు తను వదిలి
వెళ్ళేది
కేవలం శరీరాన్ని కాదని, నడిచే జ్ఞాపకాలనని.
ఎప్పుడు తెలుస్తుంది
సుఖమేదో దుఃఖమేదో
సుఖం, దుఃఖం మధ్య దూరమేదో.
ఆశే శ్వాసైన మనిషికెప్పుడు తెలుస్తుంది
మరణం ఎంత శాశ్వతమైనదో ,
జ్ఞాపకం ఎంత సజీవమైనదో.
|| 08.07.2013
||
Comments
Post a Comment