॥నువ్వు- నేను॥రాజశేఖర్ గుదిబండి (చంద్రం)
నీవు కనుపాపలతో కబుర్లు చెప్తుంటావు
నేను కలల్ని కన్నీళ్ళని చూస్తుంటాను
నీవు కనుపాపలతో కబుర్లు చెప్తుంటావు
నేను కలల్ని కన్నీళ్ళని చూస్తుంటాను
నీవు
వినువీధిలో వెండిజలతారుల వెంటపడుతుంటావు
నేను నేలరాలే చుక్కల్ని లెక్కబెడుతూ ఉంటాను
నేను నేలరాలే చుక్కల్ని లెక్కబెడుతూ ఉంటాను
నీవు
పాదాల్ని పలకరిస్తుంటావు
నేను అడుగుజాడల్ని అనుసరిస్తుంటాను
నేను అడుగుజాడల్ని అనుసరిస్తుంటాను
నీవు కడలి
కెరటాలపై అడుగులేస్తుంటావు
నేను నదిలో నావలో తెరచాపని సవరిస్తుంటాను
నేను నదిలో నావలో తెరచాపని సవరిస్తుంటాను
నీవు
జలపాతానికి జవాబులిస్తుంటావు
నేను సెలయేటి లో ఎగిరిపడే చేప పిల్లల్ని ప్రశ్నిస్తుంటాను
నేను సెలయేటి లో ఎగిరిపడే చేప పిల్లల్ని ప్రశ్నిస్తుంటాను
నీవు
వానజల్లు రంగులవిల్లవడం చూస్తుంటావు
నేను తొలకరి చినుకు మొలకవ్వడం చూస్తూ ఉంటాను
నేను తొలకరి చినుకు మొలకవ్వడం చూస్తూ ఉంటాను
నీవు ఈ
ప్రపంచాన్ని సంగీతంగా మార్చి ఆనందిస్తుంటావు
నేను విశ్వాంతరాళం లోని నిశ్శబ్దాన్ని ఆలకిస్తుంటాను
నేను విశ్వాంతరాళం లోని నిశ్శబ్దాన్ని ఆలకిస్తుంటాను
ఏవో రస రమ్య
లోకాలకి పూల బాటలేస్తూ నువ్వు
ఏ దరి చేర్చని దారుల వెంట పరుగులు తీస్తూ నేను
ఏ దరి చేర్చని దారుల వెంట పరుగులు తీస్తూ నేను
ఈ
భూమ్యాకాశాల సరిహద్దులో
నీవు నాకోసం వెతుకుతూ ఉంటావు
నేను హృదయాన్ని వెతుకుతూ ఉంటాను
॥౨౬.౦౫.౨౦౧౩॥26.05.2013॥రాత్రి 10.00॥
నీవు నాకోసం వెతుకుతూ ఉంటావు
నేను హృదయాన్ని వెతుకుతూ ఉంటాను
॥౨౬.౦౫.౨౦౧౩॥26.05.2013॥రాత్రి 10.00॥
Comments
Post a Comment