|| యజ్ఞ సమిధ ||



రాజశేఖర్ గుదిబండి (చంద్రం) || యజ్ఞ సమిధ ||
అవ్యక్త అగ్నిజ్వాల నా హృదయం
అక్కడ శలభాలు లేవు,
అక్కడ కాంతి పుంజాలు లేవు
భావాలు రగిలి  రగిలి మండుతాయక్కడ
ఆకలి పెరిగి పెరిగి బ్రద్దలవుతుందక్కడ
ఆవేదన పొగిలి పొగిలి పారుతుందక్కడ
హృదయం కాదది అగ్నిపర్వతం
నెత్తురు మండే అగ్నిగుండం

రక్తంలో నిప్పులు పోసి
గుండె గుండాన్ని రగిలింపచేసి
గళం లో గరళాన్ని  నింపి
నరాలు తెంచి నాదాన్ని సృష్టించి
మరో ప్రపంచపు మహా యజ్ఞం కై
నేను సైతం సమిధనవుతా...

మహాకవి శ్రీ శ్రీ కి కృతజ్ఞతాంజలి తో  

                        || రాసింది  1988 లో||

Comments