రాజశేఖర్ గుదిబండి(చంద్రం) ||తెలిసినా సరే... ||
నాకు తెలుసు , నాకు తెలుసు
నా లోకం ఈ లోకం కాదని
ఈ లోకం నా కోసం కాదని.
నాకు తెలుసు
ఈ లోకం
శతాబ్దాల నిశ్శబ్దాన్ని భరిస్తుందని
నాకు తెలుసు నా హృదయం
శతాబ్దాలుగా రోదిస్తుందని
నాకు తెలుసు, నాకు తెలుసు
నా రక్తం తో మండించిన దివ్విటీలు
సుడిగాలిలో చిక్కుకున్నవని
నా హృదయం లో పెల్లుబికిన ఆవేశం
ఎడారిలో ఇంకుతున్నదని
నాకు తెలుసు నేను అగాధాల
అంచున నిలబడి శోధిస్తున్నానని
నాకు తెలుసు నేను గమ్యం తెలియని
గమనం లో గతిస్తున్నానని
నాకు తెలుసు నా కోసం మృత్యువు
తలుపు తెరచి చూస్తుందని
Comments
Post a Comment